ముంబై: ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో గట్టి దెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా కాలు కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లిపోయిన రోహిత్ మళ్లీ గ్రౌండ్‌లోకి రాలేదు.
గాయం తీవ్రతను అంచనా వేయడానికి సోమవారం ఉదయం ముంబైలోని హెచ్.ఎల్. రిలయన్స్ హాస్పిటల్‌లో రోహిత్‌కు స్కాన్ నిర్వహించినట్లు సమాచారం. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తేలితే హిట్‌మ్యాన్ కనీసం రెండు మ్యాచ్‌లకు దూరమే చాన్సుంది.

