
ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేస్తారని కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో ఫస్ట్ టీ20 ఆడిన శిఖర్ ధావన్ మిగతా నాలుగు టీ20లకు ఓపెనింగ్ చేయలేదు. మరో వైపు ఓపెనింగ్ కు శుభ్ మన్ గిల్, పృథ్విషా, దేవ్ దత్ పడిక్కల్ నుంచి ధావన్ కు పోటీ ఉంది. ఈ నేపథ్యంలో వన్డేల్లో రోహిత్ కు జోడీగా ఎవరు ఓపెనింగ్ చేస్తారా అనేదానిపై సందేహాలు ఉన్నాయి. వీటికి ఇవాళ కొహ్లీ క్లారిటీ ఇచ్చాడు. రోహిత్, ధావన్ ఓపెనింగ్ చేస్తారని..ఇందులో ఎలాంటి సందేహం లేదని చెప్పాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరి జోడీ అధ్బుతంగా రాణిస్తుందన్నారు. మంగళవారం పూణెలోభారత్, ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే జరగనుంది. రెండో వన్డే 26, మూడో వన్డే 28న జరగనుంది.