
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకున్నాడు. తాజాగా చేసిన టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో అతను ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. ఆదివారం బర్మింగ్‌హామ్‌లో టీమిండియాతో కలిశాడు. తోటి ప్లేయర్లు టెస్టు మ్యాచ్‌తో బిజీగా ఉండగా.. రోహిత్ ఎడ్జ్‌బాస్టన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్టు సమాచారం. లీస్టర్‌షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ టైమ్‌లో కరోనా పాజిటివ్‌గా తేలిన హిట్‌మ్యాన్ ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు దూరమయ్యాడు. దాంతో, జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా, ఈ నెల 7 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్ జట్టును నడిపించనున్నాడు.