Cricket World Cup 2023: అశ్విన్ దగ్గర రోహిత్ సలహాలు.. కోహ్లీని అవుట్ చేసేందుకు కొత్త స్కెచ్

Cricket World Cup 2023: అశ్విన్ దగ్గర రోహిత్ సలహాలు.. కోహ్లీని అవుట్ చేసేందుకు కొత్త స్కెచ్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ కూడా వేస్తాడని చాల కొద్ది మందికే తెలుసు. ఐపీఎల్ లాంటి మెగా టోర్నీలో హ్యాట్రిక్ తీసిన ఘనత కూడా హిట్ మ్యాన్ కి ఉంది. అయితే స్టార్ బ్యాటర్ గా మారిన తర్వాత బౌలింగ్ వేయడం ఆపేసాడు. అయితే చాలా రోజుల తర్వాత మరోసారి బౌలింగ్ పై దృష్టి పెట్టాడు. 

వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 19 న భారత్-బాంగ్లాదేశ్ ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. పూణే వేదికగా జరగబోతున్న ఈ మ్యాచుకు ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ ప్రారంభించేసాయి. అయితే భారత ప్రాక్టీస్ లో మాత్రం ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ వేస్తూ కనిపించాడు. స్టార్  బ్యాటర్ విరాట్ కోహ్లీకి బౌలింగ్ వేస్తూ ఉన్న ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.
 
కోహ్లీని అవుట్ చేయడం కోసం సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ దగ్గర సలహాలు కూడా తీసుకుంటున్నాడు. దీని ప్రకారం బంగ్లాపై మ్యాచులో రోహిత్ ఏమైనా బౌలింగ్ వేస్తాడేమో చూడాలి. బౌలింగ్ సంగతి పక్కన పెడితే బ్యాటింగ్ లో మాత్రం చెలరేగి ఆడుతున్నాడు. తొలి మ్యాచులో డకౌట్ గా ఆఫ్ఘనిస్థాన్ పై సెంచరీ, ఆ తర్వాత పాకిస్థాన్ పై హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. 

ఇక వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా మూడు విజయాలతో టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ పై అలవోక సాధించి బంగ్లాపై పోరుకి సిద్ధమవుతుంది. మరోవైపు బంగ్లా మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లో ఒక విజయం సాధించింది.