MI vs CSK: ఓటమి బాధ.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన రోహిత్

MI vs CSK: ఓటమి బాధ.. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన రోహిత్

ప్రపంచంలో ప్రమాదకరమైన బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ముఖ్యంగా టీ20ల్లో చెలరేగిపోతాడు. ఛేజింగ్ లో హిట్ మ్యాన్ కు ఘనమైన రికార్డ్ ఉంది. ఈ భారత కెప్టెన్ 10 ఓవర్లు క్రీజ్ లో ఉంటే మ్యాచ్ గెలవడం దాదాపు ఖాయం. ఇక చివరి వరకు ఉంటే  గెలుపు ఖాయం. అయితే నిన్న (ఏప్రిల్ 14) చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ చివర వరకు క్రీజ్ లో ఉన్నా.. ముంబై ఇండియన్స్ ను గెలిపించలేకపోయాడు. సెంచరీ (63 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 105 నాటౌట్‌‌) చేసి మ్యాచ్ ను దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా..  మిగిలిన ఆటగాళ్లు విఫలం కావడంతో  గెలుపుకు 20 పరుగులు దూరంలో ఆగిపోయింది.

ఇన్నింగ్స్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన రోహిత్.. చివర్లో మెరుపులు మెరిపించలేకపోయాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం.. మరో ఎండ్ లో వికెట్లు పడడంతో రోహిత్ ఏమీ చేయలేకపోయాడు. చివరి ఓవర్లో సెంచరీ చేసినా అప్పటికే జట్టు పరాజయం ఖాయం కావడంతో సెలెబ్రేషన్ కూడా చేసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి చెన్నై జట్టు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఒక్కడే నడుచుకుంటూ డగౌట్ కు వెళ్ళిపోయాడు. చెన్నై సారధి గైక్వాడ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ కు వెళ్తున్నాడు. 

ఒకవైపు ముంబై ఆటగాళ్లు చెన్నై ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ముంబై ఓడిపోయిన బాధ అలాగే ఉంది. కనీసం హెల్మెట్ తీయకుండా నిరాశగా వెళ్లడం ఫ్యాన్స్ ను తీవ్రంగా బాధిస్తుంది. 12 ఏళ్ళ తర్వాత ఐపీఎల్ లో సెంచరీ చేసినా.. ఈ మూమెంట్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది. 

ఈ మ్యాచ్ లో తొలుత సీఎస్కే 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (40 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శివం దూబే (38 బాల్స్‌‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్‌‌ ) ఫిఫ్టీలకు తోడు ధోనీ (4 బాల్స్‌‌లో 3 సిక్సర్లతో 20 నాటౌట్‌‌) సూపర్‌‌‌‌ ఫినిషింగ్ ఇచ్చాడు. ఛేజింగ్‌‌లో ముంబై ఓవర్లన్నీ ఆడి 186/6 స్కోరే చేసి నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది.  పతిరణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.