లంకతో వన్డేలకు రోహిత్, విరాట్, బుమ్రా దూరం!

లంకతో వన్డేలకు రోహిత్, విరాట్, బుమ్రా దూరం!

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ , స్టార్  బ్యాటర్ విరాట్ కోహ్లీ  ఆగస్టులో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగే మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌కు దూరంగా ఉండనున్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో హార్దిక్ పాండ్యా లేదా కేఎల్‌‌‌‌‌‌‌‌ రాహుల్ టీమ్‌‌‌‌‌‌‌‌ను నడిపించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌కు  పేస్ గన్‌‌‌‌‌‌‌‌ జస్‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ నుంచి నిరంతరాయం క్రికెట్ ఆడుతున్న స్టార్ ప్లేయర్లు లాంగ్‌‌‌‌‌‌‌‌ బ్రేక్ కావాలని బీసీసీఐని కోరినట్టు తెలుస్తోంది.

37 ఏండ్ల  రోహిత్ ఆట నుంచి విరామం తీసుకుని ఆరు నెలలు అవుతోంది. డిసెంబర్–-జనవరిలో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ మొదలు అన్ని సిరీస్‌‌‌‌‌‌‌‌ల్లోనూ అతను పోటీపడ్డాడు. రాబోయే నెలల్లో ఇండియా పది టెస్టులు ఆడనున్న నేపథ్యంలో  రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, బుమ్రా లంకతో వన్డే సిరీస్‌‌‌‌‌‌‌‌ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.