
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా ఒకే టెస్టులో రెండేసి సెంచరీలు బాదిన ఆరో ఇండియన్‌గా రోహిత్ నిలిచాడు. అలాగే ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ 13 సిక్సర్లు బాదాడు. దీంతో పాకిస్థాన్ లెజెండరీ ప్లేయర్ వసీమ్ అక్రమ్ గతంలో బాదిన 12 సిక్సర్ల రికార్డు (1996లో జింబాబ్వేపై) కనుమరుగైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతిని ఏడుసార్లు స్టాండ్స్‌లోకి పంపాడు. ఇక, ఓపెనర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ రోహిత్ రికార్డులకెక్కాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ స్టంపౌటైన ఇండియా తొలి బ్యాట్స్‌మన్ రోహితే కావడం గమనార్హం.