హైకోర్టులో పెండింగ్ కేసులు 2.40 లక్షలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
పరిష్కారానికి కృషి: సీజే ఉజ్జల్ భూయాన్
హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో పెండింగ్ కేసులు 2.40 లక్షలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. సోమవారం స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా హైకోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి బార్ సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటు, పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించిందన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో లాయర్ల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన సీహెచ్ చరిష్మా, ఆర్‌బి దీక్ష, పి.శ్రీఅంజన, కె.మనీష్, ఇంటర్‌లో ఎస్.హరిణి, ఎం.వెంకటశ్రియ, చల్లా దివ్య, పి. సౌజన్యకు చీఫ్ జస్టిస్ భూయాన్ పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. 26 ఏండ్లుగా హైకోర్టులో అటెండర్‌గా పనిచేస్తున్న విరూపాక్ష రెడ్డి స్పాన్సర్ చేస్తున్న అవార్డులను సీజే విద్యార్థులకు అందజేశారు.
