ఎర్లీ బర్డ్ ను సద్వినియోగం చేసుకోండి : రోనాల్డ్​రోస్​

ఎర్లీ బర్డ్ ను సద్వినియోగం చేసుకోండి : రోనాల్డ్​రోస్​

హైదరాబాద్, వెలుగు: ఎర్లీ బర్డ్ పథకం ఈ నెల 30 వరకు అందుబాటులో ఉంటుందని, ప్రాపర్టీదారులు సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషన్ రోనాల్డ్ రోస్ సూచించారు. ఎర్లీబర్డ్ ద్వారా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రిబిట్ పొందొచ్చని చెప్పారు. గడిచిన 15 రోజుల్లో ఈ పథకం కింద రూ.230 కోట్ల ఆస్తి పన్ను వసూలైందని తెలిపారు.ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

అలాగే సిటీలోని నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను(సీ అండ్ డీ) తరలించేందుకు పెయిడ్​సర్వీస్​అందిస్తున్నట్లు కమిషనర్​తెలిపారు. జీహెచ్ఎంసీ వెబ్ సైట్, మై జీహెచ్ఎంసీ యాప్ తో పాటు టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా ఈ సేవలు వినియోగించుకోవాలన్నారు. ఉప్పల్, హయత్‌‌‌‌నగర్, -ఎల్‌‌‌‌బీనగర్, సరూర్‌‌‌‌నగర్,  మలక్‌‌‌‌పేట, -సంతోష్‌‌‌‌నగర్, -అంబర్‌‌‌‌పేట, యూసుఫ్‌‌‌‌గూడ, శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్‌‌‌‌సీపురం, పఠాన్ చెరు, మూసాపేట, కూకట్‌‌‌‌పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్లకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ 1800-120-1159, వాట్సాప్ నెంబర్ 9100927073 ద్వారా సేవలు పొందవచ్చాన్నారు.

  -చాంద్రాయణగుట్ట, చార్మినార్, -ఫలక్​నుమా, -రాజేంద్రనగర్, మెహిదీపట్నం, -కార్వాన్, గోషామహల్, -జూబ్లీహిల్స్, కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, -మల్కాజిగిరి, -సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లకు సంబంధించి టోల్ ఫ్రీ నంబర్ తోపాటు 1800-203-0033, వాట్సాప్ నంబర్ 7330000203 ద్వారా సేవలు పొందవచ్చాన్నారు. డోర్ స్టెప్ నుంచి వ్యర్థాలను తరలించేందుకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని

 కమిషనర్ తెలిపారు.