హరీశ్​ ఆరోగ్య మంత్రి కావడం దౌర్భాగ్యం: కాంగ్రెస్​ నేత నాగం

హరీశ్​ ఆరోగ్య మంత్రి కావడం దౌర్భాగ్యం:  కాంగ్రెస్​ నేత నాగం

హైదరాబాద్, వెలుగు: హరీశ్​ రావు ఆరోగ్య శాఖ మంత్రి కావడమే రాష్ట్ర దౌర్భాగ్యమని కాంగ్రెస్​ నేత నాగం జనార్దన్​ రెడ్డి మండిపడ్డారు. ఆయనకు ఉస్మానియా హాస్పిటల్​ ఎందుకు కట్టా రో.. బస్తీ దవాఖాన్ల ఉద్దేశమేందో కూడా తెలియదని బుధవారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి 12 లక్షల మంది పేషెంట్లు వస్తారని, బస్తీ దవాఖాన్లతో 7 లక్షల మంది పేషెంట్లు తగ్గారని హరీశ్ ​చెప్పడం విడ్డూరం అన్నారు. ఉస్మానియా ఆస్పత్రి టీచింగ్​ ఆస్పత్రి అని పేర్కొన్నారు. 

తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా కేంద్రాలలో ఏరియా ఆస్పత్రులు కట్టామని, ఇప్పుడు మెడికల్​ కాలేజీలు కట్టామని చెప్తున్న సర్కారు అందులో టీచింగ్​ స్టాఫ్​ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం చీడలా పరిణమించిందని, ఈ సర్కారులో విద్య, వైద్యం నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు.