పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

పాఠశాలలో పైకప్పు పెచ్చులూడి విద్యార్థులకు గాయాలు

ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. క్లాసులు నడుస్తుండగా.. ఒక్కసారిగా బిల్డింగ్ పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. దీంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే విద్యార్థులను ఎదిర ప్రైమరీ హాస్పిటల్కు తరలించారు. 

గాయపడ్డ వారిలో ఓ బాలిక, ఇద్దరు బాలురు ఉన్నారు. చిన్నారుల తలకు, ముఖం భాగంలో గాయాలయ్యాయి. వీరికి ప్రాణపాయం లేదని ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్లు చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని..ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడ్డారు.