50 లక్షల ఇండ్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్ సోలార్ సిస్టమ్స్: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

50 లక్షల ఇండ్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్ సోలార్ సిస్టమ్స్:  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ:  పీఎం సూర్య ఘర్​ ముఫ్త్​ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 20 లక్షలకు పైగా ఇళ్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్​ సోలార్​ వ్యవస్థలు ఏర్పాటు చేశామని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు.  మరో 30 లక్షల ఇళ్లకు త్వరలోనే బిగిస్తామని అన్నారు. రాష్ట్రాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం కింద కోటి ఇళ్లకు రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్​ సోలార్​ పరికరాలు ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమన్నారు. 

ఇంటి పైకప్పు లేని ప్రజల కోసం యూటిలిటీ-లెడ్​ నమూనాను ఆమోదించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఈ నమూనాను వేగవంతం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఈ పథకం డిమాండ్​ ఆధారితమైనది కాబట్టి మొదట వచ్చిన వారికి మొదట ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. 

పీఎం సూర్య ఘర్​ యోజన కింద సుమారు సగం మంది లబ్ధిదారులకు జీరో కరెంటు​ బిల్లులు వస్తున్నాయని ప్రహ్లాద్​ జోషి చెప్పారు.