జురెల్ ప్రతిభావంతుడు.. అతను పరుగులు చేయకూడదు: రూట్

జురెల్ ప్రతిభావంతుడు.. అతను పరుగులు చేయకూడదు: రూట్

శనివారం (ఫిబ్రవరి 24) రాంచీలో జరిగిన 4వ టెస్టులో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తర్వాత ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ భారత యువ వికెట్ కీపర్-బ్యాటర్ ధృవ్ జురెల్‌పై ప్రశంసలు కురిపించాడు.“ధృవ్ జురెల్ చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. అతను అద్భుతంగా ఆడాడు. తన ఆటకు భిన్నమైన కోణాన్ని చూపించాడు. అతను చాలా ప్రతిభావంతుడు. అతన్ని మూడో రోజు ఎక్కువ పరుగులు చేయకూడదని ఆశిస్తున్నా". అని రూట్  రెండో రోజు ఆట తర్వాత విలేకరులతో అన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 122 పరుగులతో చెలరేగిన రూట్, నాలుగో టెస్టులో ఇంగ్లండ్ కమాండింగ్ స్థానంలో ఉందని అన్నాడు. జురెల్ చేసిన 30 రన్స్ తో భారత్ 2వ రోజు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఇంకా 134 పరుగుల వెనుకంజలో ఉంది. అయితే ధృవ్ జురెల్ క్రీజులో ఉండడంతో టీమిండియా ఈ యువ వికెట్ కీపర్ మీదే ఆశలు పెట్టుకుంది. తన తొలి టెస్టులో ఈ యువ వికెట్ కీపర్ 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తెలుగు వికెట్ కీపర్ భరత్ స్థానంలో వచ్చి తన స్థానాన్ని భర్తీ చేసుకునే పనిలో ఉన్నాడు. 

రెండో రోజు ఆటను మూడో రోజు కూడా జుర్ల్ కొనసాగిస్తున్నాడు. దీంతో భారత్ ప్రస్తుతం 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 49 పరుగుల మీద రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్ ఆకాష్ దీప్ (0) ఉన్నాడు. 28 పరుగులు చేసిన కుల్దీప్ యాదవ్ మూడో రోజు ఉదయాన్నే అండర్సన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.