రోజ్​ వాటర్​ స్క్రబ్ ​వారానికోసారి ముఖానికి  అవసరం

రోజ్​ వాటర్​ స్క్రబ్ ​వారానికోసారి ముఖానికి  అవసరం

అకేషన్​ ఏదైనా అందంగా కనపడాలంటే.. ముఖం గురించి  ఎక్స్​ట్రా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ పింక్​ సాల్ట్​, రోజ్​ వాటర్​ స్క్రబ్​ వారానికోసారి ముఖానికి  అవసరం అంటున్నారు డెర్మటాలజిస్ట్​ పూజా చోప్రా. పింక్​ సాల్ట్​లో క్యాల్షియం, క్లోరైడ్​, ఐరన్​, మెగ్నీషియం, ఫాస్పరస్​, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. రోజ్​ వాటర్​లో యాంటీ మైక్రోబయల్​, యాంటీఆక్సిడెంట్​ ప్రాపర్టీలు ఎక్కువ. ఈ రెండింటి కాంబినేషన్​లో స్ర్కబ్​ తయారుచేసుకొని ముఖానికి వేసుకుంటే..  చర్మం​లోని పీహెచ్​ బ్యాలెన్స్​ అవుతుంది. దుమ్ము, ధూళి పోతాయి. చర్మ రంధ్రాలు టైట్​ అవుతాయి. సీబమ్​ ఉత్పత్తి తగ్గుతుంది. యాక్నె, మచ్చల సమస్యలు పోతాయి.  ఈ ప్యాక్​ చర్మాన్ని  హైడ్రేట్​ చేసి హెల్దీగా ఉంచుతుంది.  మరిన్ని లాభాలున్న ఈ స్ర్కబ్​ ఎలా తయారుచేసుకోవాలంటే.. ఒక టేబుల్ స్పూన్ పింక్​ సాల్ట్​లో ఎనిమిది చుక్కల రోజ్​ వాటర్​ , ఒక టేబుల్​ స్పూన్​ తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వేళ్లతో ఐదు నుంచి పది నిమిషాలు మసాజ్​ చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి.