
నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ(Anchor Suma) కొడుకు రోషన్ (Roshan Kanakala) హీరోగా సినిమా టాలీవుడ్కి పరిచయమవుతున్నారు. బబుల్గమ్(Bubblegum) అనే సరికొత్త టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రాన్ని క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నడైరెక్టర్ రవికాంత్ పెరేపు(Ravikanth Perepu) తెరకెక్కిస్తున్నారు.
లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే..ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.అందుకు తగ్గట్టే డైలాగ్స్ అదిరిపోయాయి. నా డెస్టినీలో ఏం రాసిపెట్టిందో నాకు తెల్వదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా..అంటూ హీరో చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది.
అలాగే ఈ సినిమాలో ప్రేమకు ఇంపార్టెన్స్ ఇస్తూ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఎవడు పడితే వాడు చేతులేశాడనుకో..చేతులు నరికేస్తానంటున్నాడు. అంతేకాకుండా..యూత్కి మెస్సేజ్ఇస్తూ చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తోంది. ప్రేమ బబుల్ గమ్ లాంటిది..మొదట్ల తీయగుంటది..ఆ తర్వాత అంటుకుంటది..షూస్ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్ పండవెట్టేస్తది..అంటూ సాగే డైలాగ్స్‌తో అదిరిపోయింది. డైలాగ్ డెలివరీ విషయంలో రోషన్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
ఓవరాల్గా ట్రైలర్ చూస్తుంటే..ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో రోషన్. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఉంది. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.