ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కస్టడీ పొడిగింపు

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కామ్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కస్టడీ పొడిగించారు. నాలుగు రోజులు పాటు కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఏప్రిల్ 1 వరకు ఈడీ కస్టడీలో కేజ్రీవాల్ ఉండనున్నారు. వారం రోజుల పాటు ఈడీ కస్టడీకోరగా..  నాలుగు రోజులకు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జడ్జి కావేజీ బవేజా. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవినుంచి తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.  

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను పదవినుంచి తప్పించాలని సుర్జిత్ సింగ్ యాదవ్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ జైలునుంచి పాలన అందిస్తే వచ్చే న్యాయపరమైన సమస్యలేమైనా ఉన్నాయా..ఉంటే వాటిని చూపించాలని పిటిషనర్ ను కోరింది. 

దీంతోపాటు ఈడీ కస్టడీని మరో వారం రోజులు పొడిగించాలని రౌస్ అవెన్యూ  కోర్టును కోరింది.విచారించిన కోర్టు నాలుగు రోజుల కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.