నార్సింగిలో జాలర్లపై రౌడీషీటర్​కత్తితో దాడి

నార్సింగిలో జాలర్లపై రౌడీషీటర్​కత్తితో దాడి

గండిపేట, వెలుగు: పైసల కోసం నార్సింగి పోలీస్​స్టేషన్​పరిధిలో మంగళవారం ఓ రౌడీ షీటర్ హల్​చల్​చేశాడు. జాలర్లను కత్తితో బెదిరించి రూ.11వేలు గుంజుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీరంచెరువు ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌‌‌‌ ఓ కేసులు జైలుకు వెళ్లాడు. పోలీసులు అతనిపై రౌడీ షీట్​ఓపెన్​చేశారు.

 వారం కిందట బెయిల్‌‌‌‌పై బయటికి వచ్చిన ఇర్ఫాన్​మంగళవారం ఉదయం పీరంచెరువు వద్ద ఉన్న జాలర్లను కత్తితో బెదిరించాడు. వారి వద్ద ఉన్న రూ. 11వేలును లాక్కున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ దాడి చేశాడు. ఈ క్రమంలో ఓ జాలరికి గాయలయ్యాయి. భయంతో జాలర్లు అక్కడి నుంచి పరుగులు తీశారు. బాధితులు నార్సింగి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.