నాంపల్లి నీలోఫర్ లో చాయ్ తాగి వెళ్తుండగా.. వ్యక్తి దారుణ హత్య..

నాంపల్లి నీలోఫర్ లో చాయ్ తాగి వెళ్తుండగా.. వ్యక్తి  దారుణ హత్య..

హైదరాబాద్ నాంపల్లిలో దారుణ హత్య జరిగింది.. నాంపల్లిలోని ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరలో జరిగింది ఈ ఘటన. గురువారం ( మే 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. చాంద్రాయణగుట్టకు చెందిన అయాన్ అనే రౌడీ షీటర్ ఓ కేసు విషయంలో నాంపల్లి కోర్టుకు హాజరై తిరిగి వెళ్తుండగా ముగ్గురు దుండగులు కత్తులతో పొడిచి చంపి పరారయ్యారు దుండగులు. మృతుడు అయాన్ నీలోఫర్ లో చాయ్ తాగి వెళ్తుండగా దుండగులు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

మొదట క్రికెట్ బ్యాట్ తో దాడి చేసిన దుండగులు... అనంతరం కత్తులతో గోతు కోసి, కడుపులో పొడిచిన దుండగులు పరారైనట్లు సమాచారం. బ్యాట్, కత్తులను సంఘటన స్థలాలొనే వదిలి వెళ్లారు దుండగులు. ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్ టీమ్ తో పోలీసులు ఆధారాలు సేకరించారు. పాత కక్ష్యాలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు పొలుసులు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.