
సౌత్ ఇండియాలో ఇటీవల గ్యాంగ్‌స్టర్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. కన్నడలో ‘కేజీఎఫ్’ సిరీస్, తమిళంలో ‘విక్రమ్’ లాంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోథా’ కూడా ఈ తరహా సినిమానే. దీంతో ఫిల్మ్ మేకర్స్ ఈ జానర్‌లో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో తెలుగులోనూ ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ రాబోతోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు విజయ్. ఇదొక గ్యాంగ్‌స్టర్ డ్రామా అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు విజయ్. గ్యాంగ్‌స్టర్స్ ఆట కట్టించే పోలీస్‌గా అతని క్యారెక్టర్ హైలైట్ అవనుందట.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి ‘ఖుషి’లో లవర్ బాయ్‌గా నటిస్తున్న విజయ్..
వెంటనే గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్.. యాక్షన్ మూవీతో రాబోతున్నాడు.