ఆర్ఆర్ఆర్: ఎత్తర జెండా వచ్చేసింది

ఆర్ఆర్ఆర్: ఎత్తర జెండా వచ్చేసింది
  • పాటకు ముందు రాజమౌళి వాయిస్ ఓవర్ అదుర్స్

రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తాజా సర్‌ప్రైజ్‌ ఎత్తరా జెండా పాట కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఈనెల 25న సినిమా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ప్రమోషన్లో భాగంగా ఇవాళ సోమవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించగా.. సాంకేతిక కారణాలతో  రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పింది. సాంకేతిక అవాంతరాలు తొలగిపోవడంతో కాని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. 
రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఆరంభంలో దర్శకుడు రాజమౌళి వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు ఆలియా భట్ కలసి వేసిన స్టెప్పులు, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాటు నాటు పాట తరహాలోనే ‘ఎత్తర జెండా’ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.