RRR నుండి కొత్త ట్రైలర్

RRR నుండి కొత్త ట్రైలర్

RRR మూవీకి సంబంధించి మరో కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. మార్చి 25న రిలీజై ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపి తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన RRR మూవీ ఈ నెల 20 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఇవాళ 11.11 నిమిషాలకు జీ5 రిలీజ్ చేసింది. రెండు నిమిషాల 20సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంటోంది. RRR నుండి మరో ట్రైలర్ రావడంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా RRR మూవీ వెయ్యికోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.