RRR రిలీజ్.. జూలై 30 కాదు జనవరి 8

RRR రిలీజ్.. జూలై 30 కాదు జనవరి 8

‘ఆర్‌‌ఆర్ఆర్’… భారీ అంచనాలున్న సినిమా. ఈ యేడు జూలై 30న వచ్చేస్తోందంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరినీ నిరాశపర్చే అప్‌డేట్ ఒకటి వెలువడింది. ఈ డేట్‌కి సినిమా రావడం లేదు. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ను వచ్చే యేడు జనవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్​ ప్రకటించింది. ‘మీరు మామీద చూపిస్తున్న ప్రేమాభిమానాలు మా కష్టాన్ని మరిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమా తీయాలని సమయాన్ని లెక్క చేయకుండా కష్టపడుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయాలని రిలీజ్ డేట్ మారుస్తున్నాం. ఇది మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుందని తెలుసు. కానీ మీకొక మంచి సినిమాను అందించడానికి కృషి చేస్తాం. వచ్చే యేడు సంక్రాంతి కానుకగా తీసుకొస్తాం. అప్పటి వరకు తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తాం’ అంటూ సోషల్ మీడియాలో తెలిపారు. రాజమౌళి సినిమా అంత తేలికగా బైటికి రాదని అందరూ అంటూ ఉంటారు. ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ విషయంలోనూ అది నిజమైంది. కాకపోతే లేట్‌గా వచ్చినా బెస్ట్‌ తీసుకొస్తారు కనుక అంతవరకు ఎదురు చూడాల్సిందే!