
ఎస్ బీఐ ఖాతాదారులు ఎనిమిది మంది నుంచి 1.49 లక్షలు విత్ డ్రా
ఢిల్లీ, కర్నాటక, కోల్ కతా ఏటీఎంల నుంచి తీసినట్లు గుర్తింపు
జనగామ, వెలుగు : జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ఎస్‌బీఐ ఖాతాల నుంచి రూ 1.49లక్షలు కాజేశారు. గురువారం రాత్రి మొదలైన విత్‌డ్రాలు శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. బాధితుల్లో కొందరు అదే రాత్రి తమ సెల్ ఫోన్ లకు వచ్చిన మెసేజ్‌లు చూడగా మరికొందరు ఉదయం లేవగానే చూసి గగ్గోలు పెట్టారు.
బాధితులు, బ్యాంకు మేనేజర్ తెలిపిన వివరాలప్రకారం.. కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ఎనిమిది మంది ఎస్‌బీఐ ఖాతాల్లోని డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఏంల ద్వారా డ్రా చేశారు. బాధితులంతా ఒకే ఊరికి చెందిన వాళ్లు. తుమ్మ నాగరాజు చేనే త కార్మికుడు. కాయ కష్టం చేసి ఖాతాలో డబ్బులుపోగేసుకున్నాడు. రోజులాగే గురువారం నిద్రపోయాడు. శుక్రవారం వేకువ జామున 3.30 గంటలకు రూ.20 వేలు ఒకసారి, రూ.20 వేలు మరోసారి మొత్తం రూ. 40 వేలు విత్‌డ్రా అయినట్లు ఉండడంతో షాక్ తిన్నాడు. తన ఏటీఎం కార్డు తన వద్దే ఉంది. మెసేజ్ మాత్రం ఎందుకు వచ్చిందని ఆందోళన చెందాడు.ఇలా మరో ఏడుగురు మోసపోయారు.
ముందు వేసి తర్వాత తీసి..
భూమా సంపత్ బ్యాంకు ఖాతాలోకి గురువారం రాత్రి 8.40 గంటలకు రూ. 20 వేలు జమయ్యాయి. ఈ మెసేజ్ చూసిన సంపత్ అనుమానంతో ఇంటర్నెట్‌బ్యాంకింగ్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. జార్ఖండ్‌కు చెందిన ఖాతా నుం చి డబ్బులు జమైనట్లు తెలుసుకున్నాడు. ఇలా చూస్తుండగానే రూ. 10 వేలు ఒకసారి, మరికొద్ది సేపట్లో మరోరూ.10 వేలు, తర్వాత రూ. 5 వేలు వెంటవెంటనేమాయం చేశారు. కర్నాటకలోని వాపి పట్టణానికి చెందిన ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసి నట్లు నిర్ధారణ అయిం ది. ప్రైవేటు టీచర్‌గా పనిచేసే ముంజాల శ్రీనివాస్ అకౌంట్ నుంచి రూ.20 వేలు, వ్యవసాయం చేసుకుని బతుకు బండి లాగుతున్న ధరావత్ శివనాయక్ ఖాతా నుంచి రూ.25 వేలు, విజయలక్ష్మి ఖాతా నుం చి రూ. 26 వేలు, సదానందం ఖాతా నుంచి రూ.18 వేలు, దేవసాని శ్రీనివాస్ ఖాతా నుంచి రూ.10 వేలు , భూసాని పూర్ణ ఖాతా నుంచి రూ.5 వేలను విత్‌డ్రా చేశారు. కర్నాటక, న్యూ ఢిల్లీ, కోల్ కతా వంటి ప్రాంతాల నుం చి డబ్బులు విత్‌డ్రా అయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. పలువురికి డబ్బులు డ్రా అయితే మెసేజ్‌లు వచ్చే సౌకర్యం లేదని, బాధితుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.
నలుగురి నుంచే ఫిర్యాదులు
తుమ్మ నాగరాజు, బూమా సంపత్ , ముంజాల శ్రీనివాస్ , ధరావత్ శివనాయక్ అనే నలుగురి నుంచి రూ 91. వేలు కాజేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. న్యూ ఢిల్లీ, కోల్ కతా, కర్నాటక వంటి ఇతర రాష్ట్రా ల్లో డబ్బులు డ్రా చేసినట్లు గా ఉంది. ఇది సైబర్ నేరగాళ్ల పని. ఈ మధ్య కాలంలో డబ్బుల లావాదేవీలకు పలు యాప్ లను విరివిగా వాడుతున్నారు. తద్వారా ఇటువంటి సమస్యలువస్తున్నాయి. బాధితులను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించాను. సైబర్‌పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయించి రిపోర్టులుతెచ్చి ఇస్తే మా బ్యాంకు ఉన్నతాధికారులకు విషయం తెలుపుతాను. రీయింబర్స్ మెంట్ కింద న్యాయం జరిగేట్లు చర్యలు తీసుకుంటా. మా బ్యాంకు ఎస్ బీఐ క్వి క్ , ఎస్ బీఐ యోనో వంటి యాప్‌లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని వాడుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. – బీ.రవీంద్రారెడ్డి, బ్యాంకు మేనేజర్ ,ఎస్ బీఐ కొడకండ్ల