రూ.కోటి మూట.. చెట్టుపై దాచిండు 

రూ.కోటి మూట.. చెట్టుపై దాచిండు 
  • రూ.కోటి మూట.. చెట్టుపై దాచిండు 
  • పెరట్లోని చెట్టుపై కాంగ్రెస్ లీడర్ ఇంట్లోని చెట్టుకు నోట్ల కట్టలు కాసినయ్
  •  పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడి ఇంటిపై ఐటీ రైడ్స్ లో సీజ్

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ జనానికి పంచడానికి తెచ్చిన డబ్బులను దాచేందుకు రాజకీయ నాయకులు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు.  కాంగ్రెస్ లీడర్ ఒకరు ​కోటి రూపాయల మూటను తన పెరట్లోని మామిడి చెట్టుపై ఇలా దాచాడు. అయినా  ఐటీ అధికారులు కనిపెట్టి స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడి ఇంట్లో  ఈ డబ్బు మూట దొరికింది. 

మైసూర్‌‌: ఎన్నికల వేళ అక్రమ డబ్బులు దాచడానికి కొందరు నాయకులు కొత్త కొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఇట్లా క్రియేటివ్ ప్లానేసిన ఒక కాంగ్రెస్ నేత అడ్డంగా దొరికిపోయిండు. మైసూరులో ఓ చెట్టుపై దాచిన కోటి రూపాయలను ఐటీ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రమణ్య రాయ్ ఇంటిపై జరిపిన ఐటీ సోదాల్లో.. ఆవరణలోని మామిడి చెట్టుపై దాచిన డబ్బు పెట్టెను స్వాధీనం చేసుకున్నారు.

అందులో ఎంత క్యాష్ ఉందని లెక్కపెట్టగా.. రూ. కోటి ఉందని తేలింది. ఎన్నికల ప్రచారానికి అక్రమంగా వినియోగించేందుకే ఈ డబ్బును దాచారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఐటీ అధికారులు ఈ విషయంపై విచారణ ప్రారంభించారు. ఈ ఐటీ రైడ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఎన్నికల నేపథ్యంలో కర్నాటకలో ఐటీ శాఖ వరుసగా రైడ్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న  బెంగళూరు పోలీసులు సిటీ మార్కెట్ ఏరియా సమీపంలో ఆటోలో తరలిస్తున్న రూ. కోటి నగదును సీజ్ చేసి, ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు.