
ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. మేనిఫెస్టో చెప్పకుండానే హామీలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తున్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. సభలు, సమావేశాలతో జనం సమస్యలను ప్రస్తావిస్తూ వచ్చిన పవన్ కల్యాణ్… ఇప్పుడు ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతున్నారు. జన సేన పార్టీకి ప్రజలు పట్టం కడితే… ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడికీ.. ఏడాదికి రూ.10లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు పవన్ కల్యాణ్.
కేంద్రం ఆయుష్మాన్ భవ పథకం కింద.. ఏడాదికి ప్రతి కుటుంబానికి రూ.5లక్షల ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ ను ఇప్పటికే ప్రకటించింది. ఐతే.. జనసేన వ్యక్తిగతంగా రూ.10లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తామని ఎన్నికల హామీ ఇస్తోంది.
ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి పది లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ , ఇది జనసైనికులతోనే శ్రీకారం చుడుతున్నాం – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/XnOkmynWAO
— JanaSena Party (@JanaSenaParty) March 1, 2019