
- అధికారులతో కుమ్మక్కు.. గత ఆగస్టులోనే బిల్లులు
- కార్పొరేటర్ ఫిర్యాదుతో రాత్రికి రాత్రి రోడ్డు వేసే ప్రయత్నం
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఐఎస్ సదన్ డివిజన్లోని సింగరేణి వాంబే కాలనీలో వేయని సీసీ రోడ్డుకు జీహెచ్ఎంసీ అధికారులు బిల్లులు మంజూరు చేశారు. కాంట్రాక్టర్ తో కుమ్మక్కై రోడ్డు వేయకపోయినా గతేడాది ఆగస్టులో రూ.9.90 లక్షల బిల్లులు రిలీజ్చేశారు. ఈ మధ్యే విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మూడు రోజుల కింద జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. కమిషనర్ విజిలెన్స్ అధికారులతో విచారణకు ఆదేశించారు. ఈ విషయం ఖాన్కన్స్ట్రక్షన్స్కాంట్రాక్టర్తో పాటు ఏఈ అన్సారీకి తెలియడంతో రాత్రికి రాత్రే రోడ్డు వేసే ప్రయత్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సింగరేణి కాలనీకి జేసీబీలను తీసుకువెళ్లి పనులు ప్రారంభించారు. స్థానికులు, కార్పొరేటర్కలిసి కాంట్రాక్టర్ ను అడ్డుకున్నారు. తర్వాత ఐఎస్‌సదన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.