సీరం ఫైర్ యాక్సిడెంట్‌‌లో రూ.వెయ్యి కోట్ల నష్టం

సీరం ఫైర్ యాక్సిడెంట్‌‌లో రూ.వెయ్యి కోట్ల నష్టం
  • మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే వెల్లడి

పుణె: సీరం ఇనిస్టిట్యూట్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో రూ.వెయ్యి కోట్ల నష్టం జరిగినట్టు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చెప్పారు. శుక్రవారం పుణెలోని సీరం ప్లాంట్ కు వెళ్లి ఘటనాస్థలిని ఆయన పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రమాదమా లేదా కుట్ర జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, సీరం కంపెనీ కూడా బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. సీరం ఇనిస్టిట్యూట్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగిందని, ఐదుగురు లేబర్లు మరణించినట్టు చెప్పారు. మల్టిఫుల్ ఫెసిలిటీస్ ఉన్నందు కొవిషీల్డ్ ఉత్పత్తిపై ఎలాంటి ఎఫెక్ట్ పడలేదని తెలిపారు. వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేసే మంజరీ ఫెసిలిటీ ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు తెలిపారు.

For More News..

రామ మందిర నిర్మాణానికి వివేక్‌‌ వెంకటస్వామి రూ. కోటి విరాళం

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు