'సమోసా' వ్యాపారం.. రోజుకు రూ.12 లక్షల ఆదాయం

'సమోసా' వ్యాపారం.. రోజుకు రూ.12 లక్షల ఆదాయం

భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సమోసా ఓ జంట జీవితాలను మార్చేసింది. నిధి సింగ్, ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ 2016లో బెంగుళూరులో తమ సమోసా దుకాణాన్ని ప్రారంభించారు. ఈ ఇద్దరు విద్యావంతులు అధిక జీతం కలిగిన కార్పొరేట్ ఉద్యోగానికి బదులుగా సమోసాలను విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వారు తాము ఉద్యోగాలు చేసే వారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.

ఈ జంట 'సమోసాలు' అమ్మడం ద్వారా రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తోంది. అంతకంటే ముందు సమోసా వ్యాపారం కోసం ఓ పెద్ద కిచెన్ స్థలం అవసరమని భావించి, వారు తమ అపార్ట్మెంట్ ను అమ్మి, ఆ డబ్బుతో బెంగళూరులో ఒక ఫ్యాక్టరీని అద్దెకు తీసుకున్నారు. హర్యానాకు చెందిన ఈ జంట తమ పొదుపు డబ్బుతో ఔట్‌లెట్‌ను ప్రారంభించారని, పెద్ద వంటగదిని నిర్మించడానికి రూ. 80 లక్షలు పెట్టుబడి పెట్టారు కూడా.

ఈ జంట 2015లో తమ ఉద్యోగాలను విడిచిపెట్టి, మరుసటి సంవత్సరం బెంగళూరులో 'సమోసా సింగ్'ను ప్రారంభించారు. అక్కడి నుంచి భారతీయ సంప్రదాయ వంటకం వారి జీవితాలను మార్చేసింది. వీరు ప్రతి నెలా 30వేల సమోసాలను విక్రయిస్తోంది. వాటి టర్నోవర్ రూ. 45 కోట్లు, ఇది రోజుకు దాదాపు రూ. 12 లక్షలన్నమాట. శిఖర్, నిధి కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో బి.టెక్ చదువుతున్నప్పుడు హర్యానాలో మొదటిసారి కలుసుకున్నారు. శిఖర్ బయోకాన్‌లో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా ఉన్నప్పుడు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. గురుగ్రామ్‌లోని ఫార్మా కంపెనీలో నిధి 30 లక్షల రూపాయల జీతం ప్యాకేజీని అందుకునేది. అలా ఆమె ఫార్మా రంగంలో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా చేరింది. ఆమె మొదటి జీతం రూ. 17వేలు.