వరంగల్, వెలుగు : హనుమకొండలోని చారిత్రక వెయ్యి స్తంభాల గుడి (రుద్రేశ్వర స్వామి ఆలయం) అభివృద్ధికి కేంద్రం రూ. 14.44 కోట్లు మంజూరు చేసింది. ఆలయ అభివృద్ధి పనులకు ప్రపోజల్స్ రెడీ చేసి రూ. 15 కోట్లు కేటాయించాలని గతంలో కేంద్రాన్ని కోరినట్లు వరంగల్ ఎంపీ కడియ కావ్య చెప్పారు.
ఈ విషయంపై కేంద్ర కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‍ను కలిసి వినతిపత్రాలు సైతం అందించామన్నారు. ఎట్టకేలకు రూ. 14.44 కోట్లు కేటాయించారని, ఈ నిధులతో కాకతీయుల కాలం నాటి శిల్పకళా వైభవాన్ని పునఃనిర్మిస్తామని చెప్పారు. నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రికి ఎంపీ కావ్య కృతజ్ఞతలు తెలిపారు.
