సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!

జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలించే చాన్స్
15 వేల లారీలు నిండనున్న శిథిలాలు
సీసీ కెమెరాల నడుమ కూల్చివేత
క్షుణ్ణంగా కూలీల తనిఖీ.. సెల్ ఫోన్లకు నో ఎంట్రీ
కూల్చివేతను వీడియో తీసిన ఇద్దరు కానిస్టేబుళ్లకు పనిష్మెంట్

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ కూల్చివేత పనులు సీసీ కెమెరాల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. శిథిలాల తరలింపునకు దాదాపు రూ. 15 కోట్లు ఖర్చు అవుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. వీటిని డంప్ చేయడానికి దాదాపు 7 ఎకరాల స్థలం అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ కు 10 కిమీ దూరంలో ఉన్న జవహర్నగర్ డంప్ యార్డుకు సెక్రటేరియట్ బిల్డింగ్స్ శిథిలాలను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు.అక్కడ సరైన స్థలం లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల అంటే కీసర గుట్ట ప్రాంతంలో డంప్ చేయాలని భావిస్తున్నారు. ఎప్పటికప్పుడు శిథిలాలను డంప్ చేయాలా? అన్ని బిల్డింగ్స్ ను కూల్చిన తర్వాతే డంప్ చేయాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. డంపింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభిస్తే పూర్తవడానికి కనీసం నెల రోజుల టైం పడుతుందని ఆర్ అండ్ బీ ఇంజనీర్లు అంటున్నారు. రాత్రి టైంలో మాత్రమే డంపింగ్ చేయనున్నారు.

సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చి వేతతో దాదాపు 15 వేల లారీల లోడు శిథిలాలు ఏర్పాడుతాయని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. సెక్రటేరియట్ లో మొత్తం 10 బ్లాకులు ఉన్నాయి. వీటి కూల్చివేతతో ఏర్పడే శిథిలాలను డంప్ చేయడానికి వందల సంఖ్యలో టిప్పర్లు, లారీలు, అందులోకి లోడ్ చేయడానికి వందల సంఖ్యలో జేసీబీలు, ప్రొక్యిలెన్లు అవసరమని ఇంజనీర్లు భావిస్తున్నారు. వీటి కోసం రాష్ట్రంలో రోడ్డు కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వివిధ కంపెనీలను సంప్రదిస్తున్నట్టు తెలిసింది.

చదును కోసం కొన్ని శిథిలాలు
దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెక్రటేరియట్ స్థలం అక్కడక్కడ ఎత్తుపల్లాలుగా ఉంది. అన్ని బిల్డింగ్స్ ను కూల్చిన తర్వాత చదును చేయనున్నారు. ఇందుకోసం కొంత మేర శిథిలాలను ఉపయోగించుకునే చాన్స్ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. మిగతా శిథిలాలను డంపింగ్ చేయక తప్పదని చెబుతున్నారు. ప్రస్తుతం బిల్డింగ్స్ ను మాత్రమే కూల్చుతున్నారు. త్వరలో కాంక్రీట్స్, ఐరన్ను వేరు చేసే ప్రాసెస్ స్టార్ట్ కానుంది.

చుట్టూ నిఘా కెమెరాలు
సెక్రటేరియట్ చుట్టూ గతంలో ఉన్న సీసీ కెమెరాలు మళ్లీ యాక్టివేట్ చేశారు. వాటి నిఘాలో కూల్చి వేతలు జరుగుతున్నాయి. ఎక్కడ ఏ విధంగా పనిజరుగుతుందో పరిశీలించేందుకు స్పెషల్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కూల్చి వేత పనులు చేసే కూలీలను క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. సెల్ ఫోన్లను సెక్యూరిటీలో డిపాజిట్ చేశాకనే లోపలికి పంపుతున్నారు. సోమవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైన సెక్రటేరియట్ కూల్చివేత పనులు గురువారం కూడా కొనసాగాయి. ఈ పనులను సీఎస్, డీజీపీ పర్యవేక్షించినట్టు తెలిసింది. ఏ, బీ బ్లాక్ లను సగం మేరకు కూల్చివేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెల్ ఫోన్లలో కూల్చివేత దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను డ్యూటీస్ నుంచి తప్పించి హెడ్ ఆఫీసుకు అటాచ్ చేశారు.

ఇంప్లోజివ్ టెక్నాలజీతో ముప్పు!
సెక్రటేరియట్లోని ఎల్, జే బ్లాకులు 12 అంతస్తులుగా ఉన్నాయి. వీటిని ఎలా నేలమట్టం చేయాలో ఆఫీసర్లకు అర్థంకావడం లేదు. సాధారణ పద్ధతిలో కూల్చితే చాలా రోజుల టైం పడుతుంది. అందుకని ఇంప్లోజివ్ టెక్నాలజీ ద్వారా కూల్చితే ఎలా ఉంటుందని ఇంజనీర్లతో ఆఫీసర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంప్లోజివ్ టెక్నాలజీ ద్వారా కూల్చితే 500 మీటర్ల దూరంలోని నిర్మాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఇంజనీర్లు అంటున్నట్లు తెలిసింది.

For More News..

12 హాస్పిటళ్లు తిరిగినా పట్టించుకోలే.. ఊరికి వాపస్ వెళ్తూ యాక్సిడెంట్లో మృతి

సర్కార్ దవాఖాన్లకు పోతలేరు

అల్లు అర్జున్ తో సినిమా చాన్స్ అంటూ.. అమ్మాయిలతో..