వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు

వ్యవసాయ రంగానికి రూ. 2.83 లక్షల కోట్లు

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న బడ్జెట్ 2020లో వ్యవసాయ రంగానికి, నీటి పారుదల రంగానికి కలిపి రూ. 2.83 లక్షల కోట్లు కేటాయించారు. ‘వ్యవసాయ మార్కెట్లు మరింత లిబరలైజై కావాలి. రైతులకు చేయుతగా నిలిచేలా ఉండాలి. రైతుల ఆదాయం పెంపు, సంక్షేమం కోసం 16 పాయింట్ యాక్షన్ ఫార్ములా తెస్తున్నాం. వ్యవసాయంలోనూ పెట్టుబడులు పెరగాలి. అగ్రి సేవలపై దృష్టి పెడితే ఎకనమీ బూస్ట్ చేయొచ్చు. 6.11 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్ బీమా యోజన కింద బీమా కల్పిస్తున్నాం’ అని ఆమె అన్నారు.

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2020-2021 సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థికమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు ఇది రెండవసారి. 2020బడ్జెట్‌పై దేశం మొత్తం భారీ అంచానాలను పెట్టుకుంది. ప్రజల ఆదాయం పెంచె దిశగా బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఇది సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు.

Union Budget 2020 LIVE Nirmala Sitharaman LIVE