
హైదరాబాద్, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా 'స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్' పథకం కింద ప్రభుత్వం దేవాలయాలకు నిధులు విడుదల చేసింది. మెదక్ జిల్లా నాగసాని పల్లి ఏడుపాయల దుర్గా మాత ఆలయంలో ఉత్సవాల నిర్వహణకు 2 కోట్లు, మేడ్చల్ జిల్లాలోని కీసర గుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయానికి కోటిని విడుదల చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
బుధవారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి చెందిన ఒగ్గు పూజారుల యాదవ సంఘం నేతలు సెక్రటేరియెట్ లో మంత్రి కొండా సురేఖను కలిశారు. ఆరోగ్య భద్రత కల్పించాలని, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. దాంతో కొమరెల్లి ఈవోతో మంత్రి మాట్లాడారు. ఒగ్గు పూజారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.