అవాక్కయ్యారా.. : పని మనిషి జీతం రూ. 2 కోట్లు

అవాక్కయ్యారా.. : పని మనిషి జీతం రూ. 2 కోట్లు

ఏంటీ టైటిల్ వినగానే షాక్ అయ్యారు.. పని మనిషి ఏంటీ.. జీతం 2 కోట్ల రూపాయలు ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ఇది అక్షర సత్యం అండీ.. రెండు కోట్ల రూపాయలు ఇచ్చే పని ఏముంటుందీ అని ఆలోచిస్తున్నారా.. అక్కడికే వస్తున్నాం.. చైనా దేశం షాంఘై సిటీకి చెందిన ఓ మహిళ బహిరంగంగా ఇచ్చిన ప్రకటన ఇప్పుడు ప్రపంచంలోనే సంచలనంగా మారింది. 2 కోట్లకు తగ్గట్టు ఆమె చెప్పే పనులు సైతం అలాగే ఉన్నాయి.. ఇంతకీ ఆ పనులు ఏంటో కూడా తెలుసుకుందాం..

పని మనిషి చేయాల్సిన పనులు ఇవే :

24 గంటలూ ఇంట్లోనే ఉండాలి. ఆ మహిళ అన్ని అవసరాలు టైం టూ టైం.. నిమిషం ఆలస్యం కాకుండా చేయాలి. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేపాలి. ఆ వెంటనే వాటర్, టీ, కాఫీ ఇవ్వాలి. బాత్రూంలో అన్నీ రెడీ చేసి పెట్టాలి. ఓనర్ డైలీ షెడ్యూల్, వివిధ పనుల కోసం బయటకు వెళుతుంది కదా.. అందుకు తగ్గట్టుగా దుస్తులు రెడీ చేసి పెట్టాలి. అ తర్వాత టిఫిన్ రెడీ చేయాలి. అది మెనూ ప్రకారం ఉండాలి. టేస్ట్ తేడా ఉండకూడదు. ఆ తర్వాత సాక్స్ లు వేయాలి.. షూ తొడగాలి. ఓనర్ బయటకు వెళుతున్నప్పుడు గేటు తీసి.. ఆమె వీధి చివరి వరకు వెళ్లే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇంటిని అంతా శుభ్రం చేయాలి. ధుమ్మూధూలి అస్సలు ఉండకూడదు. మధ్యాహ్నం లంచ్ చేయాలి. ఓనర్ ఇంటికి వచ్చే సమయంలో మెసేజ్ చేస్తుంది కాబట్టి.. గేటు తీసి పెట్టాలి. లంచ్ తర్వాత రెస్ట్ తీసుకోవటానికి అన్నీ ఏర్పాట్లు చేయాలి. సాయంత్రం స్నాక్స్, రాత్రికి డిన్నర్ అంతా ప్రిపేర్ చేయాలి. మధ్యలో ఏమైనా ఆహారం, ఇతర అవసరాలు కోరితే వెంటనే చేసి పెట్టాలి. రేపటికి మళ్లీ షెడ్యూల్ రెడీ చేసి సిద్ధం చేసుకోవాలి. 24 గంటలూ అందుబాటులో ఉంటూ.. అన్నీ చూసుకోవాలి. 

ఇక పని మనిషి కూడా చాలా శుభ్రంగా ఉండాలి. డ్రెస్ సెన్స్ మెయింటెన్ చేయాలి. ఫైవ్ స్టార్ హోటల్ లెక్క ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి. ఓపిక ఉండాలి. ఎత్తు 165 సెంటీమీటర్లు ఉండాలి.. 55 కేజీల బరువు ఉండాలి. చైనా విద్యా వ్యవస్థకు తగ్గట్టు 12వ తరగతి పూర్తి చేసి ఉండాలి. చైనా భాషతోపాటు ఇంగ్లీష్ చదవటం, రాయటం తెలిసి ఉండాలి. ఎంతో శుభ్రంగా ఉండాలి. 

ఇన్ని పనులు చేయాల్సి ఉండటంతో.. అందుకు తగ్గట్టుగానే జీతం కూడా ఇస్తుంది. నెలకు 16 లక్షల రూపాయల చొప్పు.. ఏడాదికి రెండు కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటన ఇచ్చింది ఆ మహిళ. 

ఇంతకీ ఆ యజమానురాలికి పని మనిషి దొరికిందా లేదా అనే డౌట్ కదా.. ప్రస్తుతానికి అయితే దొరకలేదు. ప్రకటన మాత్రం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇంటర్వ్యూ చాలా టప్ గా ఉందని.. పని మనుషులు చెబుతున్నారంట. ఏంటీ ఈ వార్త చదివిన తర్వాత ఛీ.. అనే డైలాగ్ నోటి నుంచి వస్తుందా.. ఈ ఐటీ, గీటీ జాబ్స్ ఎందుకు అనే థాట్ వస్తుంది.. అందరిదీ అనే ఫీలింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు..