ప్రభుత్వ బ్యాంకులకు రూ.20 వేల కోట్ల టోపీ

ప్రభుత్వ బ్యాంకులకు రూ.20 వేల కోట్ల టోపీ

ఆర్‌ టీఐ ప్రశ్నకు.. ఆర్‌ బీఐ ఆన్సర్

ఎక్కువ కేసులు ఎస్‌ బీఐలోనే

బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎక్కువ నష్టం

న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌‌లు(పీఎస్‌ బీలు) ఏప్రిల్–జూన్ క్వార్టర్‌‌‌‌లో రూ.19,964 కోట్లకు పైగా మోసాలను రిపోర్ట్ చేశాయి. ఫ్రాడ్ కేసుల సంఖ్య 2,867గా ఉన్నట్టు ఆర్‌‌‌‌టీఐ క్వరీకి సమాధానంగా ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌ బీఐ)లో అత్యధికంగా ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయి. వాల్యు పరంగా చూసుకుం టే, బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా దెబ్బతిన్నదని ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. 12 పీఎస్‌ బీల్లో ఎస్‌ బీఐలో గరిష్టం గా 2,050 ఫ్రాడ్ కేసులు రిపోర్టయ్యా యి. వీటి విలువ రూ.2,325.88 కోట్లు గా ఉంది.

వాల్యు పరంగా ఎక్కువగా దెబ్బతిన్న బ్యాంక్‌‌ ఆఫ్ ఇండియాలో 47 కేసులు నమోదయ్యాయి.

ఈ కేసుల మోసం విలువ రూ.5,124.87 కోట్లు గా ఉంది.

కెనరా బ్యాంక్‌‌లో 33 కేసులు, వాటి విలువ రూ.3,885.26 కోట్లు గా నమోదైంది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 60 కేసులు వాటి విలువ రూ.2,842.94 కోట్లు గా..

ఇండియన్ బ్యాంక్‌‌లో 45 కేసులు వాటి విలువ రూ.1,469.79 కోట్లుగా..

ఇండియన్ ఓవర్‌‌‌‌సీస్ బ్యాంక్‌‌లో 37 కేసులు వాటి విలువ రూ.1,207.65 కోట్లు గా

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 9 కేసులు వాటి విలువ రూ.1,140.37 కోట్లు గా రిపోర్ట్ చేసింది.

ప్రభుత్వ రంగంలో రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌‌బీ) లో రూ.270.65 కోట్ల విలువైన మోసాలు నమోదయ్యాయి. కేసుల సంఖ్య 240కి పెరిగింది. ఇతర బ్యాంక్‌‌ల్లో యూకో బ్యాంక్‌‌లో రూ.831.35 కోట్ల మోసాలు జరిగాయి. కేసుల సంఖ్య 130గా ఉంది.