2 వేల నోటు.. హవాలాకు టోకెన్.. మాఫియా కొత్త ఐడియా

2 వేల నోటు.. హవాలాకు టోకెన్.. మాఫియా కొత్త ఐడియా

2 వేల రూపాయల నోటు రద్దయ్యింది.. చెల్లుబాటు కావటం లేదు.. ఇది జగమెరిగిన సత్యం.. ఈ రద్దయిన 2 వేల నోటు ఇప్పుడు సరికొత్త మాఫియాకు తెరతీసింది. ఆర్బీఐకి రాని కొన్ని 2 వేల నోట్లు.. ఇప్పుడు హవాలా మాఫియా చేతుల్లో ఉన్నాయి.. హవాలా డబ్బు తరలింపునకు..ఈ 2 వేల రూపాయల నోట్లను వాడుతున్నట్లు కేరళ పోలీసులు తేల్చారు. గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం మార్కెట్ లో పెద్ద నోటు అంటే 500 రూపాయలే.. 20 లక్షల రూపాయలు తరలించాలంటే చెక్ పోస్టుల్లో తనిఖీలతో ఇబ్బందులు..దీంతో 2 వేల నోటులోని సీరియల్ నెంబర్ ఆధారంగా.. 2 వేల నోటు ద్వారా హవాలా మాఫియా డబ్బు మార్పిడికి ఉపయోగిస్తున్నట్లు కేరళ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో వెలుగులోకి రావటం సంచలనంగా మారింది.

రూ. 2000 కరెన్సీ నోట్లను హవాలా రాకెట్లు అక్రమ నగదు బదిలీకి ఉపయోగిస్తున్నట్లు సెంట్రల్ ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో( CEIB)  చెబుతోంది. కొరియర్లను దోచుకునే సంఘటనలు పెరుగుతుండటంతో హవాలా ఆపరేటర్లు రూ. 2వేల కరెన్సీ నోట్లను ఉపయోగించి సేఫ్ టోకెన్ సిస్టమ్ ను వినియోగిస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంలో రద్దు చేసిన ఈ 2వేల నోట్లను టెండర్లు వేస్తుస్తున్నారు. ఈ టోకెన్ విధానంలో  కేవలం రెండు రూ. 2వేల నోట్లను బదిలీ చేస్తే రూ. 10లక్షలు, 20 నోట్లను అక్రమంగా బదిలీ చేస్తే రూ. 1కోటి రూపాయలు  తరలిస్తారు. ఈ నోట్ల సీరియల్ నంబర్లను ముందుగానే రిసీవర్ కు పంపిస్తారు. కొరియర్ కోడ్ నంబర్ ను ఇస్తారు. హవాలామాఫియాకు కరెన్సీ నోట్లు, కోడ్ నంబర్ అందగానే.. ఆనోట్ల విలువకు సరిపడా క్యాష్ ఇస్తారు.