విషం కలిపిన పాలు ఇచ్చి ముగ్గురు పిల్లలను చంపేసిన తండ్రి.. తర్వాత అతనూ ప్రాణం తీసుకున్నడు !

విషం కలిపిన పాలు ఇచ్చి ముగ్గురు పిల్లలను చంపేసిన తండ్రి.. తర్వాత అతనూ ప్రాణం తీసుకున్నడు !

నంద్యాల: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో దారుణం జరిగింది. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. మద్యం మత్తులో తండ్రి వేములపాటి సురేంద్ర(34) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కావ్య( 7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్ (2) తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పాలు ఇచ్చి తండ్రి వాళ్లను చంపేశాడు. అనంతరం.. అతనూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

2025 ఆగస్ట్ 16న సురేంద్ర భార్య మహేశ్వరి (32) అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి ముగ్గురు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం సురేంద్రకు కష్టంగా మారింది. దీనికి తోడు.. మద్యానికి బానిసయ్యాడు.

భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న సురేంద్ర రోజూ పని ముగించుకున్న తర్వాత ఇంటికి తాగి వెళ్లేవాడు. పిల్లల యోగక్షేమాలను పెద్దగా పట్టించుకోలేదు. ఇక.. పిల్లలను పెంచడం తన వల్ల కాదని సురేంద్ర ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.