పాలమూరు, రంగారెడ్డిపై తలోమాట తగదు : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ

పాలమూరు, రంగారెడ్డిపై తలోమాట తగదు : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్​పై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్  తలోమాట మాట్లాడి రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని సీపీఐ ఆఫీస్​లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో పూర్తయి ఉండేదన్నారు. 

తొమ్మిదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  60 శాతం పనులు మాత్రమే పూర్తి చేసి ప్రాజెక్టును ఆగమేఘాల మీద ప్రారంభించిందని విమర్శించారు. అధికారంలోకి వస్తే నెలల వ్యవధిలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్​ చెప్పిందని, ఇప్పటికీ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు మానుకొని ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు.