డేటా ఎంట్రీ ఆపరేటర్ పై కేసు పెట్టండి : డిప్యూటీ కలెక్టర్ నాయక్

డేటా ఎంట్రీ ఆపరేటర్ పై కేసు పెట్టండి :  డిప్యూటీ కలెక్టర్  నాయక్
  •     డిప్యూటీ కలెక్టర్  నాయక్ 

వీపనగండ్ల, వెలుగు: ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్న జగదీశ్ పై కేసు నమోదు చేయాలని డిప్యూటీ కలెక్టర్  నాయక్  బుధవారం ఎస్సై కె రాణిని ఆదేశించారు. మండలంలోని గోపాలదిన్నె గ్రామ  రైతులతో మాట్లాడారు. 

వడ్లు కొనుగోలు చేయకుండానే, అక్రమాలకు పాల్పడిన ఆపరేటర్​పై చర్యలు తీసుకోవాలని రైతులు, సర్పంచ్  దొడ్ల కవిత కోరారు. తహసీల్దార్  వరలక్ష్మి, ఏపీఎంలు మద్దిలేటి, రాంబాబు, ఉప సర్పంచ్  వెంకటయ్య, దొడ్ల బాల్​రెడ్డి, కురుమయ్య తదితరులు ఉన్నారు