
ఒక్కో వస్తువు ఒక్కొక్కరికి ఒక్కోలా కనబడుతుంది. ఎవరికి ఏది నచ్చుతుందో వారికే తెలియాలి. ఈ వ్యక్తికి అరటిపండులో ఏంనచ్చిందో మరి.. ఆయన ఒక అరటిపండును అక్షరాల రూ. 85 లక్షలకు కొన్నాడు. అవును.. మీరు చదివేది నిజమే.
ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో కాటేలాన్ ‘కమెడియన్’పేరుతో మియామీ బీచ్‌లో ఒక ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేశాడు. ఆ గ్యాలరీలో పలు కళాఖండాలను ప్రదర్శనకు పెట్టాడు. కాటేలాన్ ఎక్కడికి వెళ్లినా తన రూంలో ఒక అరటిపండును గోడకు అతికించి ఉంచుతాడు. ఆయన ఏర్పాటు చేసిన గ్యాలరీలో కూడా అలాగే ఓ అరటి పండును ఉంచాడు. ఇలా మొత్తం మూడు అరటిపండ్లను ప్రదర్శనకు పెట్టగా ఇప్పటికే రెండు పండ్లు అమ్ముడుపోయాయి. వాటిలో ఒక అరటిపండును ఒక వ్యక్తి రూ. 85 లక్షలు పోసి కొన్నాడు. అయితే ఆ పండు ఇలా అత్యధిక ధరకు అమ్ముడుపోతుందని ఆయన కూడా ఊహించలేదు. అరటిపండ్లను, టేపు మాత్రమే ఉపయోగించి వాటిని అమూల్యమైన కళాఖండాల మధ్య ఉంచడంతో వీటికి ఇంత క్రేజ్ వచ్చింది. పైగా వీటికి సర్టిఫికేషన్ కూడా కల్పించారు. కేవలం 0.30 డాలర్ల(రూ. 21)కు కొనుగోలు చేసిన పండు రూ. 85 లక్షలు రాబట్టడం కాటేలాన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తితింది.
ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శనలో రెండు పండ్లు అమ్ముడుపోగా మిగిలి ఉన్న ఒక్క అరటిపండును న్యూయార్క్ ఆర్టిస్ట్ డేవిడ్ డాతునా తినేశాడు. ప్రదర్శనను చూడడానికి వచ్చిన డేవిడ్.. ఇలా అకస్మాత్తుగా అరటిపండును తినడం అక్కడి అధికారులను విస్మయానికి గురిచేసింది. డేవిడ్ చేసిన ఈ పనికి పరిణామాలను ఎదుర్కొవలసి వస్తుందని అధికారులు అంటున్నారు. తాను మౌరిజియో కాటెలన్ కళాకృతులను ప్రేమిస్తున్నాని.. అలాగే ఇంత ధర పలికిన ఈ పండు కూడా చాలా రుచికరంగా ఉందంటూ ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆయన ఇలా పండు తినే సన్నివేశాన్ని మొత్తం ‘హంగ్రీ ఆర్టిస్ట్’పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
For More News..