ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల అమలులో జాప్యం వల్లే సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నాడని డెవలప్మెంట్సొసైటీ ఫర్ది డెఫ్ జాతీయ కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కోకన్వీనర్ వెంకటేశ్‌గౌడ్ అన్నారు. ఆదివారం నల్లకుంటలోని డెఫ్ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. సాయి ఈశ్వర్ చారి సూసైడ్చేసుకోవడం బాధాకరమన్నారు. అతని కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షల పరిహారంతోపాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల కోసం బీసీలు పోరాటం చేయాలని సూచించారు.
