
అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్ పామ్ టన్నుకు రూ.25 వేలు ఇవ్వాలని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు తుంబూరు మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కొక్కరపాటి పుల్లయ్య కోరారు. మంగళవారం ఢిల్లీలో అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావెల్ కు వినతిపత్రం అందించారు.
సీపీఎం అనుబంధ అఖిల భారత కిసాన్ సదస్సుకు హాజరైన సందర్భంగా రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంఘ నేతలు తమ సమస్యలపై చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కాపు కాయని ఆయిల్ పామ్ మొక్కలకు నష్టపరిహారాన్ని విత్తన కంపెనీ నుంచి వసూలు చేసి బాధిత రైతులకు చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఆయిల్ పామ్ రైతు సంఘ నేతలు జంగారెడ్డి శ్రీనివాసులు, సోమయ్య, వెంక ట్, చందు నాయక్ పాల్గొన్నారు.