కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం

కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్తే రూ. 29 లక్షల జీతం

పెట్ లవర్స్ కి గుడ్ న్యూస్. ‘సంవత్సరానికి 29 లక్షల జీతాన్ని ఇస్తాం..ప్యాషనేట్ డాగ్ వాకర్ కావాలి..’ అంటూ లండన్ కు చెందిన జోసఫ్ హేజ్ ఆరోన్సన్ అనే లా ఫర్మ్ కంపెనీ ఒక యాడ్ ఇచ్చింది. ఈ సంస్థలోని ఓ సీనియర్ అధికారికి చెందిన కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లేందుకు మనిషి కావాలనేది ఆ యాడ్ సారాంశం. ఉదయం సాయంత్రం వేళల్లో కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లాలి. దీనికోసం సంవత్సరానికి 30 వేల పౌండ్లు జీతం. ఆడామగా ఎవరైనా సరే ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అప్లై చేసుకునేవాళ్లు పెట్ లవర్స్ అయి ఉండాలి. అలాగే యాక్టివ్ గానూ ఉండాలట. ఎందుకంటే ఈ కుక్కను ఎక్కువగా వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఈ కంపెనీ ఇంకో ఆఫర్ కూడా ఇచ్చింది. అదేంటంటే పెన్షన్, లైఫ్ ఇన్సూరెన్స్, డెంటల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇస్తామని చెప్పింది. వీకెండ్ లో శని, ఆదివారాలు సెలవులు తీసుకోవచ్చు. అయితే ఇంత మంచి ఆఫర్ ను ఎవరైనా వదులుకుంటారా? అందుకే ఈ జాబ్ కోసం ఇప్పటివరకూ కొన్ని వేల అప్లికేషన్స్ వచ్చాయట. ఎవరిని ఆ 29 లక్షల జీతం ఆఫర్ వరిస్తుందో మరి!

For More News..

ఇంటర్ పాసైతే చాలు..