వంగూరు, వెలుగు: చారకొండ మండలం సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కోసం అదనంగా మరో కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను, ఆలయ కమిటీని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉమా, ఆలయ కమిటీ చైర్ పర్సన్, అధికారులు పాల్గొన్నారు.
