లివ్ఇన్ రిలేషన్ పేరుతో రూ.30 లక్షల మోసం

లివ్ఇన్ రిలేషన్ పేరుతో రూ.30 లక్షల మోసం

పంజాగుట్ట, వెలుగు: లివ్‌ ఇన్‌ రిలేషన్‌ పేరుతో ఓ వ్యక్తి తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని హైదరాబాద్​మణికొండకు చెందిన స్వాతి ఆరోపించారు. కొందరు రాజకీయ నేతల అండతో పోలీసులు కూడా నిందితుడికే సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి సాయికిరణ్‌తో రెండేళ్లుగా తాను లివ్‌ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో తనను నమ్మించి రూ.30 లక్షలు తీసుకుని, తర్వాత తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.