కామారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి రూ. 3.23 కోట్లు

కామారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్ కాలేజీల అభివృద్ధికి రూ. 3.23 కోట్లు
  • జిల్లా ఇంటర్​ బోర్డు నోడల్ అధికారి షేక్​ సలామ్

సదాశివనగర్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 20 ప్రభుత్వ జూనియర్​ కళాశాలల అభివృద్ధి కోసం  ప్రభుత్వం రూ. 3.23 కోట్లు మంజూరు చేసిందని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి షేక్​ సలామ్​ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేసి లెక్చరర్లతో మాట్లాడారు.  

జిల్లాలోని జూనియర్ కాలేజీలలో 4 వేల మంది విద్యార్థులను చేర్చాల్సి ఉండగా,  3266 మంది చేరారని, ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఓపెన్​ టైన్త్​ విద్యార్థులు ఇంటర్​లో చేరవచ్చన్నారు.  కొత్త 57 మంది లెక్చరర్లను ప్రభుత్వం నియమించిందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సింగం శ్రీనివాస్, లెక్చరర్లు పాల్గొన్నారు.