కోల్‎కతాలో రూ.38 లక్షల నగదు స్వాధీనం

కోల్‎కతాలో రూ.38 లక్షల నగదు స్వాధీనం

కోల్‎కతా: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కోల్‎కతాలోని టోలీగంజ్ ప్రాంతంలో ఆదివారం ఒక వాహనం నుంచి రూ.38 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేతాజీ నగర్ ఏరియాలోని ఎన్​ఎస్​సీ బోస్ రోడ్డులో ఉన్న ‘ప్లైవుడ్ హౌస్ మోర్’ వద్ద ఆగి ఉన్న కారులో ఈ నగదు దొరికినట్లు కోల్​కతా పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖకు అప్పగించారు. 

ఆ వాహనం యజమాని అలీపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారవేత్త అని గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం చర్చనీయాంశమైంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.