ఆటో రంగంలో రూ. 38,300 కోట్ల డీల్స్.. వెల్లడించిన గ్రాంట్ థార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్

ఆటో రంగంలో రూ. 38,300 కోట్ల డీల్స్.. వెల్లడించిన గ్రాంట్ థార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్

న్యూఢిల్లీ: మనదేశ ఆటోమోటివ్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెప్టెంబరు క్వార్టర్లో రికార్డు స్థాయిలో 4.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 38,300 కోట్ల) విలువైన 30 లావాదేవీలు జరిగాయి. టాటా మోటార్స్ ఇవెకో ఎస్​పీఏను 3.8 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 31,630 కోట్ల) కొనుగోలు చేసింది. 

గ్రాంట్ థార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టన్ నివేదిక ప్రకారం.. ఏడాదికి పైగా కాలంలో ఇదే అతిపెద్ద డీల్స్ క్వార్టర్. టాటా మోటార్స్-ఇవెకో డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మినహాయిస్తే, ఈ క్వార్టర్​లో డీల్స్ విలువ జూన్ క్వార్టర్​ కంటే 36 శాతం తగ్గింది.  

ఈ క్వార్టర్​లో ఏడు డీల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెర్జర్స్, అక్విజిషన్స్ కార్యకలాపాల విలువ 4.1 బిలియన్ డాలర్లు.ఇది గత క్వార్టర్​తో పోలిస్తే సంఖ్యాపరంగా 13 శాతం తగ్గినా, విలువ మాత్రం 1,234 శాతం పెరిగిందని గ్రాంట్​ థార్న్​టన్​ వెల్లడించింది.