V6 News

Telangana Global Summit :రెండు రోజుల్లో 5 లక్షల 39 వేల 495 కోట్ల పెట్టుబడులు

Telangana Global Summit  :రెండు రోజుల్లో   5 లక్షల  39 వేల 495 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగుతోంది. పలు దేశ , విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. రెండో రోజు కూడా  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు పారిశ్రామిక వేత్తలు.  రెండో రోజు 2 లక్షల 96 వేల995  కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి పలు జాతీయ ,అంతర్జాతీయ కంపెనీలు.  మొదటి రోజు 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం రెండు రోజుల్లో డిసెంబర్  9న సాయంత్రం 4 గంటల వరకు 5 లక్షల 39 వేల 495 కోట్ల పెట్టుబడులకు తెలంగాణ  ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.

Also read:- తెలంగాణలో నాలుగు ప్రధాన సర్క్యూట్ల ద్వారా టెంపుల్ టూరిజం అభివృద్ధి

డిసెంబర్ 9న ఒప్పందాలు

  •  రెండో రోజు ఫెర్టిస్ ఇండియా 2 వేల కోట్ల పెట్టుబడులు
  • ఫుడ్ అండ్ బేవరేజస్ యూనిట్ విస్తరణకు కేజేఎస్ ఒప్పందం
  •  జేఎసీ కే 9 వే లకోట్ల పెట్టుబడులకు ఒప్పందం
  •  ఫుడ్ అండ్ ఎఫ్ఎంసీజీ తయారీ యూనిట్ కు ఆర్సీపీఎల్ ఒప్పందం
  • ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫాక్చరింగ్ సేవల విస్తరణకు కైన్స్ టెక్నాలజీ ఒప్పందం
  •  భారత్ బయోటిక్ రూ. 1000 కోట్ల పెట్టబడులు
  • గోద్రేజ్ రూ. 150 కోట్ల పెట్టుబడులు
  • ఏఐ రెడీ డేటా పార్క్ రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు
  • అరబిందో రూ. 2 వేల కోట్ల పెట్టుబడులు 
  • కేజేఎస్ ఇండియా రూ. 650 కోట్లు
  • హెటిరో గ్రూప్ 1800 కోట్లు
  • రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1500 కోట్లు

తొలిరోజే డిసెంబర్ 08 రాష్ట్రానికి దేశ, విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. మొదటి రోజు సుమారు రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలు  35 ఎంవోయూలపై సంతకాలు చేశాయి. డీప్‌టెక్‌, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అంగీకరించాయి.