ఫ్యాన్సీ నెంబర్లకు మస్త్ గిరాకీ.. 9 నెలల్లో రూ.54 కోట్లు వచ్చాయి

ఫ్యాన్సీ నెంబర్లకు మస్త్ గిరాకీ.. 9 నెలల్లో రూ.54 కోట్లు వచ్చాయి

ఫ్యాన్సీ నెంబర్‌లకు డిమాండ్ మాములుగా ఉండదు.  కార్లు, బైక్‌లకు లక్కీ నెంబర్, ఫ్యాన్సీ నంబర్ల కోసం వాహనదారులు ఎక్కడా కూడా తగ్గకుండా  లక్షలు ఖర్చు చేస్తున్నారు. దీంతో  తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీకు భారీగా ఆదాయం పెరుగుతోంది.  ఫ్యాన్సీ నంబర్ల ద్వారా ఆర్టీఏకి గత మూడేళ్లుగా వచ్చిన ఆదాయం కంటే .. గత 9 నెలల్లో వచ్చిన ఆదాయం ఎక్కువగా ఉంది.  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో  కేవలం 9నెలల్లో 54కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. 

ALSO READ : స్పై కెమెరాతో ఎగ్జామ్ లో చీటింగ్... కేసు నమోదు

2020సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాల్లో ఆర్టీఏకి 10.22కోట్ల ఆదాయం వస్తే రంగారెడ్డి జిల్లాల్లో 10.02 వచ్చింది. అదే విధంగా 2021లో హైదరాబాద్‌లో 16.38కోట్లు..రంగారెడ్డి జిల్లాలో 16.38కోట్ల ఆదాయం వచ్చింది. 2022లో 22.56కోట్ల ఆదాయం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 28.06 కోట్లు వచ్చింది. ఇక ఈ ఏడాది అంటే 2023లో జనవరి నుంచి ఆగస్ట్ 31వ తేది వరకు 21.23 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీఏ అధికార వర్గాలు వెల్లడించాయి.