హైదరాబాద్, వెలుగు: మేనేజ్డ్ఆఫీస్ స్పేస్‌లను అందించే రియల్ ఎస్టేట్ కంపెనీ ఐస్ప్రౌట్ తమ వ్యాపారాన్ని విస్తరించడానికి టాటా క్యాపిటల్ నుంచి రూ.60 కోట్లు అప్పుగా సమీకరించింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐస్ప్రౌట్కు తొమ్మిది నగరాలలో 25 కో-–వర్కింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇవి 2.5 మిలియన్ చదరపు అడుగుల్లో విస్తరించాయి.
సమీకరించిన నిధులను భారతదేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాలలో కొత్త సెంటర్లను ఏర్పాటు చేయడానికి కంపెనీ ఉపయోగిస్తుంది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ల కోసం, వర్క్‌స్పేస్ కస్టమైజేషన్సామర్థ్యాల కోసం, ఎండ్- టు -ఎండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సేవలను విస్తరించడానికి కూడా ఈ పెట్టుబడిని వాడుకుంటుంది. కార్పొరేట్ సంస్థల నుంచి మేనేజ్డ్ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని ఐస్ప్రౌట్ తెలిపింది.

